శనివారం 06 జూన్ 2020
Cinema - May 13, 2020 , 12:59:34

సితార‌తో జ‌ర్నీ చాలా ఫ‌న్‌గా ఉంటుంది: న‌మ్ర‌త‌

సితార‌తో జ‌ర్నీ చాలా ఫ‌న్‌గా ఉంటుంది: న‌మ్ర‌త‌

లిటిల్ ప్రినెన్స్ సితార నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. చిన్నారికి  సంబంధించిన సింగింగ్‌, డ్యాన్సింగ్ లేదా ఇత‌ర‌త్రా వీడియోలు మ‌హేష్ లేదా సితార త‌ర‌చూ షేర్ చేస్తూ ఉంటారు. ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. తాజాగా మ‌హేష్ భార్య న‌మ్ర‌త త‌న ఇన్‌స్టాగ్రాములో  స్పైడర్ సినిమాలో బూమ్ బూమ్ సాంగ్ ని అద్భుతంగా పాడుతున్న సితార‌ వీడియో పోస్ట్ చేశారు.

ఈ వీడియోకి కామెంట్‌గా ..ప్ర‌యాణంలో సితార ఉంటే ఆ స‌ర‌దానే వేరు. సితార ఉన్న‌ప్పుడు ఎలాంటి పాటల ఆల్బమ్ మరియు ప్లే లిస్ట్ అవసరం లేదు. సితార‌తో ప్ర‌యాణం చేస్తుంటే చాలా ఫ‌న్‌గా ఉంటుంద‌ని న‌మ్ర‌త చెప్పుకొచ్చింది. సితార ..వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్య‌తో క‌లిసి ఎ అండ్ ఎస్ అనే యా ట్యూబ్ ఛానెల్ కూడా న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ని వీరిద్ద‌రు నెటిజ‌న్స్‌కి షేర్ చేస్తూ ఉంటారు.logo