ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 10, 2020 , 10:59:51

మా పిల్ల‌లు ఒలంపిక్స్‌కు రెడీ: న‌మ్ర‌త‌

మా పిల్ల‌లు ఒలంపిక్స్‌కు రెడీ: న‌మ్ర‌త‌

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌తా శిరోద్క‌ర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. త‌న భ‌ర్త సినిమా విష‌యాల‌తో పాటు ఇంట్లో సంగ‌తుల‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా త‌రుచు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహ‌ప‌రుస్తుంటుంది. క‌రోనా వ‌ల‌న గౌత‌మ్, సితార‌లు ఇంటికే ప‌రిమితం కావ‌డంతో వారు ఇంట్లో చేసే సంద‌డికి సంబంధించి అనేక విష‌యాల‌ను లాక్‌డౌన్ టైంలో చెప్పుకొచ్చింది న‌మ‌త్ర‌.

తాజాగా న‌మ్ర‌త‌.. త‌న పిల్ల‌లు స్విమ్మింగ్ చేస్తున్న వీడియోల‌ను షేర్ చేస్తూ.. మా పిల్ల‌లు ఒలంపిక్స్‌కు రెడీ అని కామెంట్ పెట్టింది. పిల్ల‌ల‌ను వారికి న‌చ్చిన ప‌నుల‌ను చేయ‌మంటాను. అన్నింటిలో ఆసక్తి చూప‌మ‌ని చెబుతుంటాను. వ్యాయామంతో పాటు వేరే ఆట‌లు ఆడుతుంటూ మీ మెద‌డు ఉత్తేజితం అవుతుంద‌ని న‌మ్ర‌త స్ప‌ష్టం చేసింది. కాగా, న‌మ్ర‌త కొద్ది రోజుల క్రితం మాద‌క ద్ర‌వ్యాల‌కు సంబంధించి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. 


logo