Cinema
- Jan 24, 2021 , 06:32:43
VIDEOS
దుబాయ్‌లో ఘనంగా నమ్రత బర్త్‌డే సెలబ్రేషన్స్ .. పిక్స్ వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రత బర్త్‌డే వేడుక జరిపించేందుకు ఫ్యామిలీ అందరిని దుబాయ్ తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ నమ్రత తన 49వ బర్త్‌డే వేడుక జరుపుకోగా, ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలానే తన బర్త్ డే సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్స్ మహేష్ బాబు తండ్రి కృష్ణ సొంతూరైన బుర్రిపాలెంలో ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. మెడికల్ క్యాంప్‌ని ఏర్పాటు చేసి 135 మంది గ్రామస్థులకు ఉచిత పరీక్షలు చేసారు. ఆంధ్ర హాస్పిటల్స్‌లో భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషంగా ఉందని.. ఐదేళ్లలో ఇది 29వ హెల్త్ క్యాప్ అని నమ్రత సోషల్ మీడియాలో వెల్లడించారు. నమ్రత బర్త్‌డే రోజున సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజావార్తలు
MOST READ
TRENDING