మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 18, 2020 , 11:24:19

న‌మిత‌తో అసభ్యంగా ప్ర‌వ‌ర్తించిన నెటిజ‌న్‌..

న‌మిత‌తో అసభ్యంగా ప్ర‌వ‌ర్తించిన నెటిజ‌న్‌..

సోష‌ల్ నెట్‌వ‌ర్క్స్ ద్వారా సెల‌బ్రిటీల‌ని టార్గెట్ చేస్తూ అస‌భ్య‌ప‌ద‌జాలంతో మాట్లాడుతుండ‌డం ఇటీవ‌లి కాలంలో మ‌రింత ఎక్కువైంది. కొంద‌రు వీటిని తెలివిగా ఎదుర్కొంటూ వ‌స్తున్నారు. తాజాగా న‌మిత త‌నతో అస‌భ్యంగా మాట్లాడిన వ్య‌క్తి బండారాన్ని బ‌య‌ట‌పెట్టింది. వివ‌రాల‌లోకి వెళితే డీఎమ్ (ఐయామ్ త‌మిళ్ సెంత‌మిళ్  ఇన్‌స్టా యూజ‌ర్ నేమ్‌)  అనే  వ్య‌క్తి న‌మిత‌తో చాటింగ్ చేశాడు.  హాయ్ ఐటమ్ అని సంభోదిస్తూ చాటింగ్ చేయ‌డంతో ఒళ్లు మండిన నమిత నెటిజన్‌తో వాదనకు దిగింది. 

ముందు  ట్విట్టర్ హ్యాక్ అయ్యిందని చెప్పిన వ్య‌క్తి, న‌మిత ఆ మాట‌ల‌ని న‌మ్మ‌డం లేద‌ని తెలియ‌డంతో  నమితను బెదిరించడం మొదలుపెట్టాడు. నమిత పోర్న్ వీడియోలు ఉన్నాయంటూ వాటిని బయట పెడతామని బెదిరింపులకు పాల్పడ్డాడు . దీంతో ప‌క్కా ప్లాన్ వేసిన న‌మిత త‌న‌ని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాడి బండారం బ‌య‌ట పెట్టేసింది. అతడి గురించి వివ‌రిస్తూ త‌న‌తో చాట్ చేసిన విష‌యాల‌ని స్క్రీన్ షాట్‌తో సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.  న‌మిత ధైర్యాన్ని నెటిజ‌న్స్ ప్ర‌శంసిస్తున్నారు. 

ఒక‌ప్పుడు సినిమాల‌తో  ఫుల్‌గా బిజీగా ఉండే న‌మిత గ‌త కొద్ది కాలంగా సైలెంట్ అయింది.  ఇటీవల  తమిళ దర్శక, నిర్మాత వీరేంద్రచౌదరిని వివాహ‌మాడింది. ఇప్పుడిప్పుడే మ‌ళ్ళీ సినిమాల‌తో బిజీ అవుతుంది. అప్ప‌ట్లో బొద్దుగా ఉండే న‌మిత ఇప్పుడు చాలా స్లిమ్‌గా మారింది.  సొంతం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు  ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు  జెమినీ, బిల్లా, సింహా వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించింది. logo