అమిత్ తివారి, భాను శ్రీ, తనికెళ్లభరణి, నాజ ర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. రవిచరణ్ దర్శకుడు. ఆర్.ఎమ్ నిర్మాత. సోమవారం నాజర్ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. కౌబాయ్ టోపీతో రివాల్వర్ పట్టుకొని నాజర్ కనిపిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇరాన్లో నివసించే తెలుగు శాస్త్రవేత్తగా నాజర్ పాత్ర విభిన్నంగా సాగుతుంది. నల్లమలను క్షేత్రంగా చేసుకొని ప్రపంచాన్ని శాసించే ప్రయోగాలకు అతడు సిద్ధపడతాడు? అదేమిటన్నది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.