శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 21:05:21

నాగశౌర్య బర్త్ డే స్పెషల్.. 'పోలీసు వారి హెచ్చరిక' ఫస్ట్ లుక్‌

నాగశౌర్య బర్త్ డే స్పెషల్.. 'పోలీసు వారి హెచ్చరిక'  ఫస్ట్ లుక్‌

కుర్ర హీరో నాగశౌర్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ప్లాపులు పక్కనపెట్టి ఈయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అశ్వద్ధామ తరువాత బ్రేక్ తీసుకుని నాగశౌర్య ప్రస్తుతం సినిమాలతో వస్తున్నాడు. జనవరి 21న ఆయన పుట్టిన రోజు సందర్భంగా నాగ‌శౌర్య నటిస్తున్న కొత్త సినిమా పోలీసు వారి హెచ్చరిక ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాను కొత్త దర్శకుడు రాజేంద్ర తెరకెక్కిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ తో 118 నిర్మించి..విజయ్ హీరోగా వచ్చిన విజిల్, మాస్టర్ సినిమాలు తెలుగులో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుంది. 

కచ్చితంగా ఈ సినిమాతో మళ్ళీ హిట్టు కొట్టి ఫామ్ లోకి వస్తానంటున్నాడు నాగశౌర్య. పోలీసు వారి హెచ్చరికతో పాటు వరుడు కావలెను సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు నాగశౌర్య. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిపోయింది. పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ ఇందులో హీరోయిన్. మరోవైపు సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ లో లక్ష్య సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేసి తన లుక్ పూర్తిగా మార్చేశాడు.

ఈ మూడు సినిమాలతోపాటు మరో రెండు కథలు కూడా సిద్ధంగా ఉంటాడు నాగ శౌర్య. ఖచ్చితంగా 2021లో మూడు సినిమాలు విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులోనూ వేటికవే భిన్నమైన కథలతో వస్తున్నాడు ఈ కుర్రహీరో. కచ్చితంగా ఈ సినిమాలు తన కెరీర్ కు చాలా ఉపయోగపడతాయని ధీమాగా చెబుతున్నాడు. ఈ పుట్టినరోజు వరస సినిమాలతో సెలబ్రేట్ చేసుకున్నాడు శౌర్య. మరి ఇందులో ఏ సినిమా ఈ కుర్ర హీరో కోరుకున్న విజయాన్ని తీసుకువస్తుందో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

చిరంజీవి ఆ రీమేక్ ను ప‌క్క‌న పెట్టాడా..?

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo