టాలీవుడ్ (Tollywood) యువ హీరో నాగశౌర్య (Naga Shourya) నటిస్తోన్న తాజా చిత్రం లక్ష్య (Lakshya). స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా..? అని ఎదురుచూస్తున్న సినీ లవర్స్ కోసం కొత్త అప్ డేట్ అందించారు మేకర్స్. లక్ష్య చిత్రాన్ని నవంబర్ 12న విడుదల చేయనున్నారు. అని ఈ సినిమా కోసం సీరియస్ గా వర్కవుట్స్ చేసి లుక్ ను పూర్తిగా మార్చుకున్నాడు.
సోనాలి నారంగ్, నారాయణ్ దాస్ కే నారంగ్, పీ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ (Ketika Sharma)హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఆర్చరీ (విలువిద్య) క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పార్థు అనే క్రీడాకారుడి పాత్రలో నాగశౌర్య కనిపించబోతున్నాడు. పార్థు జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ సాగే ఈ చిత్రానికి కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్.
కాగా నాగశౌర్య మరోవైపు లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో వరుడు కావలెను సినిమా కూడా చేస్తున్నాడు. రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి లాక్ డౌన్ ఎఫెక్ట్ తో విరామం తీసుకున్న నాగశౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వినోదాన్ని పంచేందుకు సిద్దమవుతున్నాడు.
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ