బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 25, 2020 , 23:26:59

కరోనాపై క్లాస్‌ ఇచ్చిన శివమణి

కరోనాపై క్లాస్‌ ఇచ్చిన శివమణి

‘నా పేరు శివమణి. నాక్కొంచెం మెంటల్‌'  అంటూ ‘శివమణి’ (2003) సినిమాలో పోలీసాఫీసర్‌గా నాగార్జున్‌ చేసిన హల్‌చల్‌ ఎవరూ మర్చిపోలేరు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మెప్పించింది. తాజాగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సినిమాలోని డైలాగ్స్‌ను స్ఫూఫ్‌ చేసి కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను నాగార్జున ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నా రు. ‘నేను ఇప్పుడు పూరి జగన్నాథ్‌తో ‘శివమణి’ సినిమా చేస్తే డైలాగ్స్‌ ఇలాగే ఉంటాయి’ అంటూ నాగార్జున వీడియోను షేర్‌ చేశారు. భవిరి రవి ఈ కరోనా డైలాగ్స్‌కు డబ్బింగ్‌ చెప్పారు. ‘శివమణి’ సినిమాలో పూర్ణ మార్కెట్‌ సెంటర్‌లో రౌడీషీటర్లకు శివమణి వార్నింగ్‌ ఇస్తాడు. ఆ డైలాగ్‌లను తొలగించి ‘నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్‌. ఇప్పటివరకు మాస్కులు లేకుండా ఎందుకు తిరిగారో నేను అడగ. కానీ  సడన్‌గా కరోనా వచ్చింది. మాస్కులు వేసుకొండి. కరోనా అంటే భయం లేదా మీకు? టీవీల్లో పీఎం, సీఎంలు మొత్తుకుంటుంటే అర్థం కావట్లేదా..పోపో..మాస్క్‌ వేసుకో. మళ్లీ మటన్‌, చికెన్‌ అంటూ ఎవరైనా గుంపులుగా వస్తే దూల తీర్చేస్తా’ అంటూ నాగార్జున హెచ్చరిస్తున్న సంభాషణలు అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయి.  


logo