మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 14:30:21

రీమేక్ ఆలోచ‌న‌లో నాగార్జున‌..!

రీమేక్ ఆలోచ‌న‌లో నాగార్జున‌..!

సీనియ‌ర్ హీరో నాగార్జున త‌న త‌నయులు నాగ చైత‌న్య‌, అఖిల్‌తో పోటీ ప‌డుతూ సినిమాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తుండ‌గా ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. మ‌రోవైపు నాగార్జున‌.. ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో ఓ మూవీ రూపొంద‌నుంద‌నే వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

ఇవిలా ఉంటే నాగార్జున బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం రైడ్ సినిమాని రీమేక్ చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. ఎప్ప‌టి నుండో ఈ మూవీ రీమేక్ గురించి నాగ్ ఆలోచిస్తుండ‌గా, ఇటీవ‌ల దీనిపై ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. యంగ్ డైరెక్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ని అంటున్నారు. త్వ‌ర‌లో దీనిపై ఓ క్లారిటీ రానుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo