నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘ది ఘోస్ట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యాక్షన్ స్పైథ్రిల్లర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఆదివారం ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగార్జున నల్లటి కోటు ధరించి చేతిలో కరవాలంతో శక్తివంతంగా కనిపిస్తున్నారు. పోస్టర్‌పై ‘నో మెర్సీ’ అనే క్యాప్షన్‌ను జోడించారు. మోషన్‌పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ‘మీరు అతని నుంచి పారిపోలేరు. మీరు అతనిలో చర్చలు జరపలేరు. కేవలం మీరు దయ కోసం మాత్రమే వేడుకోవచ్చు’ అనే సంభాషణ ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. గుల్‌పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ముఖేష్ జి, యాక్షన్: రాబిన్‌సుబ్బు, నభా మాస్టర్, నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్, నిర్మాతలు: నారాయణదాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్‌మరార్, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.