గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 09:00:41

డంబ్ షెరాడ్స్ గేమ్‌తో హౌజ్‌మేట్స్‌ని ఉత్సాహ‌ప‌రిచిన నాగ్

డంబ్ షెరాడ్స్ గేమ్‌తో హౌజ్‌మేట్స్‌ని ఉత్సాహ‌ప‌రిచిన నాగ్

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్‌4లో ఆదివారం నాటి ఎపిసోడ్ చాలా సంద‌డిగా సాగింది. ఇంటి స‌భ్యుల‌తో డంబ్ షెరాడ్స్ గేమ్ ఆడించిన నాగ్‌, ఆ గేమ్‌లో వ‌చ్చిన సినిమా టైటిల్స్ ఎవ‌రికి స‌రిపోతాయ‌ని అడిగాడు. ఇంట్లో వాళ్ళు చెప్పింది, ఆడియ‌న్స్ చెప్పింది ఒక‌టేనా అని క్లారిటీ ఇచ్చేందుకు పోస్ట‌ర్స్ రిలీజ్ చేశాడు. 

డంబ్ షెరాడ్స్ గేమ్‌లో ముందుగా  ఊహ‌లు గుస‌గుస‌లాడే టైటిల్‌ను అఖిల్ మూగ సైగ‌ల‌తో చేసి చూపించ‌గా దానిని సుజాత‌కు అసైన్ చేశారు. ఇక మెహ‌బూబ్‌కు రేసు గుర్రం పోస్ట‌ర్, అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు మాస్ట‌ర్‌, నోయ‌ల్‌కు శంక‌ర్‌దాదా ఎంబీబీఎస్‌, అరియానాకు జ‌ల్సా, సోహైల్‌కు పోకిరీ, లాస్య‌కు పెద‌రాయుడు, అఖిల్‌కు అర్జున్ రెడ్డి, అవినాష్‌కు డార్టింగ్‌,  మోనాల్‌ ఏ మాయ చేశావే, దివికి అందాల రాక్ష‌సి, కుమార్ సాయికి మ‌త్తు వ‌ద‌ల‌రా, హారిక‌కు ఫిదా పోస్ట‌ర్‌లు సూట్ అవుతాయ‌ని తెలిపారు.

అభిజిత్ ఓ పాట‌కు డ్యాన్స్ చేసే స‌మ‌యంలో ఒక‌రిని సెల‌క్ట్ చేసుకోవ‌ల‌సి ఉండ‌గా, అరియానాని ఎంపిక చేసుకున్నాడు. అభితో క‌లిసి డ్యాన్స్ చేసే అవ‌కాశం ద‌క్కించుకున్న అరియానా తెగ ఫీలైపోయింది. డ్యాన్స్ చేస్తూనే ఎగ్జైట్ అవుతుంది. ఇక ఈ గేమ్‌లో కొంద‌రు వారికి వ‌చ్చిన సినిమాల నుండి డైలాగ్స్ చెప్ప‌గా, మ‌రి కొంద‌రు డ్యాన్స్‌లు చేశారు.  అయితే అఖిల్ ఆ పిల్ల నాది అన్న డైలాగ్ చెప్పిన‌ప్పుడు అత‌ని వేలు మాత్రం క‌రెక్ట్‌గా(మోనాల్ వైపు) చూపించావ‌ని నాగ్ సెటైర్ వేశారు. అనంత‌రం నోయ‌ల్ సేఫ్ అయిన‌ట్లు వెల్ల‌డించారు. అంత‌క‌ముందు అరియానాని సేవ్ చేశారు నాగార్జున‌.

ఇక ఈ టాస్క్ పూర్తైన త‌ర్వాత బిగ్ బాస్ హోట‌ల్ టాస్క్‌లో అతిథులుగా ఉన్న వారు ఎంత టార్చ‌ర్ పెట్టారో ఇప్పుడు స్టాప్ వారిని అలానే వేదించొచ్చు అనే ఛాన్స్ ఇచ్చారు నాగార్జున‌. ఇందులో భాగంగా రాజ‌శేఖ‌ర్.. హారిక నుదుటిపై గ్లాస్ పెట్టుకొని న‌డ‌వాల‌ని చెప్పారు. వెంట‌నే దానిని హారిక ప్ర‌య‌త్నించ‌గా విఫ‌లైమంది. ఇక కోడి పిల్ల‌లా‌గా సోహైల్ శ‌బ్ధం చేస్తూ రెక్క‌లు విదుల్చుతూ న‌డిచాడు. అరియానా.. అవినాష్‌ను ఎత్తుకుని ప‌ది నిమిషాలు ఉండాల‌ని సుజాత చాలెంజ్ విసిరగా, కొంత సేపు అత‌నిని అలానే ఎత్తుకున్న అరియానా ఒకేసారి కింద ప‌డేసింది.. ఆ త‌ర్వాత మెహ‌బూబ్.. సుజాత‌ను ఎత్తుకుని 50 సార్లు పైకి కింద‌కు లేపాడు. మెహ‌బూబ్ ప్ర‌య‌త్నాన్ని అంద‌రు ప్ర‌శంసించారు. అనంత‌రం లాస్య, మోనాల్‌ సేఫ్ అయిన‌ట్లు తెలిపారు నాగార్జున‌.


logo