అభిజీత్‌పై సీరియస్ అయిన నాగార్జున

బిగ్ బాస్ 4 తెలుగులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే మరో అనుమానం లేకుండా అంతా చెప్పే పేరు అభిజీత్. ఎందుకో తెలియదు కానీ ఈయనకు సోషల్ మీడియాలో క్రేజ్ బాగా పెరిగిపోయింది. సీజన్ 2లో కౌశల్ కు ఎలా డిమాండ్ ఉండేదో ఇప్పుడు అభిజీత్ కూడా అలాగే మారిపోయాడు. ఇంట్లో చాలా సెటిల్డ్ గా కనిపిస్తుంటాడు ఈయన. అప్పుడప్పుడూ ఆటిట్యూడ్ చూపిస్తుంటాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు కూడా పక్కన బెట్టేసి హాయిగా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. బాడీని వాడకుండా బుర్రతోనే నెట్టుకురావాలని చూస్తుంటాడు. ఈయన ఆడే గేమ్ కు బయట బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే అన్ని రోజులు మనవి కావంటారు కదా.. ఇప్పుడు అభి విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్కును పట్టించుకోలేదు అభిజీత్.. పూర్తి చేయలేదు ఈయన.
దాంతో వీకెండ్ వచ్చేసింది కదా.. నాగార్జున కూడా వచ్చేసాడు. వచ్చీ రావడంతోనే హారికతో పాటు అభిజీత్ ను ఇద్దర్నీ క్లాస్ పీకాడు. ముఖ్యంగా హారికను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచి క్లాస్ తీసుకున్నాడు నాగ్. హారిక నువ్వు ఫర్ ది పీపుల్.. బై ది పీపుల్.. టు ది పీపుల్ కెప్టెన్ అయ్యానన్నావ్ కానీ మోనాల్ నిన్ను కెప్టెన్ చేస్తే.. అభిజీత్ కోసం నువ్వు అయ్యావ్ అంటూ సైటైర్ వేసాడు. కెప్టెన్సీని పర్సనల్ రిలేషన్ కోసం వాడుకున్నావంటూ సీరియస్ అయ్యాడు. అభిజీత్ టాస్క్ చేయనన్నపుడు కెప్టెన్‌గా చేయించాల్సిన బాధ్యత నీకుందా లేదా అంటూ ప్రశ్నించాడు నాగార్జున. దానికి హారిక నుంచి సమాధానం రాలేదు. మరోవైపు అభిజీత్ పై మాత్రం చిన్నసైజ్ రుద్ర తాండవం చేసాడు నాగార్జున. ప్రతీసారి ఆయన ఆటను మెచ్చుకునే నాగ్ ఈ సారి మాత్రం చిందేసాడు.
బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినపుడు చేయనని చెప్పడం ఎంత పెద్ద తప్పో తెలుసా అభిజీత్ నీకు అంటూ సీరియస్ అయ్యాడు. మోనాల్‌ను ఏడిపించారు అనే లైన్ తనకు నచ్చలేదని అభిజీత్ చెప్పడంతో.. పాత వీడియోను ప్లే చేసి అడ్డంగా బుక్ చేసాడు నాగార్జున. దాంతో తన తప్పు ఒప్పుకున్నాడు అభి. కానీ అక్కడికీ నాగార్జున శాంతించలేదు. ఆ వెంటనే మీరు అంటే నేను పడతాను సర్ అంటూ నాగార్జునకు చెప్పడంతో నువ్వు నా వైపు తప్పు నెట్టేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. బిగ్ బాస్ ఓపెన్ ది గేట్స్ ప్లీజ్ అంటూ గేట్స్ తెరిపించాడు. అయితే అభిజీత్‌ను ఇంటి నుంచి పంపేయడం ఈజీయేం కాదు.. మనోడికి సపోర్ట్ బాగానే ఉంది. అయితే బిగ్ బాస్ లో ఏదైనా సాధ్యమే. మరి చూడాలిక ఏం జరగబోతుందో..?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు