మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 15, 2020 , 09:02:49

హౌజ్‌మేట్స్‌పై ఫైర్ అయిన నాగార్జున‌

హౌజ్‌మేట్స్‌పై ఫైర్ అయిన నాగార్జున‌

బిగ్ బాస్ సీజ‌న్ 4లో దీపావళి ఎపిసోడ్ దుమ్ము రేపింది. హౌజ్‌మేట్స్‌ని మించి నాగార్జున న‌టించారు. నాగ్ ప‌ర్‌ఫార్మెన్స్‌తో హౌజ్‌మేట్స్ అంద‌రు క‌న్నీటి కుళాయి తిప్పారు. అఖిల్‌ని స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని అంద‌రు ఒప్పుకోగా, నాగార్జున అత‌నికి కెప్టెన్ ప‌వ‌ర్ అందించాడు. ఇక ఆయ‌న భార్య దీవాళి సంద‌ర్భంగా హౌజ్‌మేట్స్‌కు డ్రై ఫ్రూట్స్ పంపించారు. అంతా సంద‌డిగా సాగిన 69వ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగిందో చూద్దాం

ఎపిసోడ్ మొద‌ట్లో అవినాష్‌, సోహైల్‌లు క‌లిసి మోనాల్‌ని కొంచెం సేపు ఆడుకున్నారు.ఆ త‌ర్వాత ఎగ్ దోసె గురించి కాసేపు కొట్లాడుకున్నారు. ఆ త‌ర్వాత ఫొటోలు దిగి వాటిని టీవీలో చూసి ఆనందించారు. ఇక మ‌న టీవీ ద్వారా హౌజ్‌మేట్స్ ముందుకు వ‌చ్చిన నాగార్జునకి హౌజ్‌మేట్స్ గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పారు. ఆయ‌న  సాంగ్స్‌కి అద్భుతంగా డ్యాన్స్ చేసి అల‌రించారు.

ఇక హౌజ్‌మేట్స్ ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫుల్ ఫిదా అయిన నాగ్‌ అంద‌రికి గిఫ్ట్స్ ఇచ్చి ఆ త‌ర్వాత క్లాస్ పీకారు. ఇచ్చిన టాస్క్‌ని స‌రిగా అర్దం చేసుకోకుండా ఎవరికి వారు స్ట్రాంగ్ అని చెప్పుకున్నారు. బిగ్ బాస్ చెప్పింది మూడు విష‌యాలు. అవి ఎవ‌రు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? ఎవ‌రు మీ గేమ్‌కు అడ్డుప‌డ‌తారు? ఫైన‌ల్స్‌కు మీకు అడ్డొచ్చేది ఎవ‌రు? అని. మీకు మీరే ఏదో ఊహించుకొని అఖిల్‌ని పంపించారు అంటూ ఫైర్ అయ్యాడు 


logo