మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 01, 2020 , 08:49:45

మ‌నాలీ నుండి హౌజ్‌మేట్స్‌కు గిఫ్ట్ తెచ్చిన నాగార్జున‌

మ‌నాలీ నుండి హౌజ్‌మేట్స్‌కు గిఫ్ట్ తెచ్చిన నాగార్జున‌

వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం నాగార్జున 21 రోజుల కాల్షీట్స్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మనాలీలో షూటింగ్‌తో బిజీగా ఉన్న కార‌ణంగా నాగార్జున గ‌త వారం బిగ్ బాస్ షోని హోస్ట్ చేయ‌లేక‌పోయాడు. ఆయ‌న స్థానంలో స‌మంత హాజ‌రైంది. అయితే ఈ వారం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసి నాగార్జున‌ని తీసుకొచ్చారు బిగ్ బాస్ నిర్వాహ‌కులు. ఆ గ‌ట్టునుంటావా.. అనే పాటతో స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మ‌న టీవీలోకి వెళ్ళిపోయాడు. ముందు రోజు జ‌రిగిన సంగ‌తుల‌ని చూపించాడు.

బిగ్ బాస్ శ‌నివారం ఎపిసోడ్ మొద‌ట్లో అమ్మాయిలు, అబ్బాయిల‌ని రెండు గ్రూపులుగా విడ‌గొట్టి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో వంట‌లు చేయాల్సి ఉంటుంద‌ని, ఎవ‌రు బాగా చేశార‌నేది అభిజిత్‌, మెహ‌బూబ్‌లు నిర్ణ‌యించాల‌ని చెప్ప‌డంతో వారు అబ్బాయిలకే త‌మ ఓటేశారు. విజేత‌లుగా నిలిచిన అబ్బాయిలు ఎగిరి గంతేశారు. ఇక బిగ్ బాస్ ఓటింగ్‌కి సంబంధించి అనేక విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో నాగ్ మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రేక్ష‌కుల ఓటింగ్ ఆధారంగానే ఇది జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు. తి ఓటు ఒక థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తుందని ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వాళ్లు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతారని గుర్తు చేశారు.

 ఇక ఈ వారంలో అమ్మా రాజశేఖర్, మొహబూబ్, అఖిల్, లాస్య, అరియానాలు నామినేష‌న్‌లో ఉన్నార‌నే విష‌యం గుర్తు చేసిన నాగార్జున మ‌నాలీ నుండి హౌజ్‌మేట్స్‌కు స్వెట్ట‌ర్స్‌ని గిఫ్ట్‌గా తెచ్చారు. కరోనా వ‌ల‌న చాలా షాప్స్ బంద్ ఉండ‌గా, ఒకే ఒక్క షాప్ తెర‌చి ఉండ‌డంతో అక్క‌డ ప‌ట్టుకొచ్చాని చెప్పారు. అనంతరం సోహైల్‌- అఖిల్ మ‌ధ్య ఉన్న చిన్న గ్యాప్‌ని నాగార్జున ఓ వీడియో చూపించి క్లియ‌ర్ చేశారు. అలానే మోనాల్‌కు అభిజిత్ ప్ర‌వ‌ర్త‌న‌పై ఆమె గురించి అభిజిత్‌, నోయ‌ల్‌, హారిక‌, లాస్య ఏమ‌నుకుంటున్నారో వీడియో ద్వారా చూపించారు.  ఇది చూసి ఎమోష‌న‌ల్ అయిన మోనాల్‌.. నోయ‌ల్ మంచిగా ఉంటూ పుల్ల‌లు పెడుతున్నాడంటూ వాపోయింది. 

ఇక క‌న్ఫెష‌న్ రూంలోకి వ‌చ్చిన అరియానాకి కూడా వీడియో చూపించారు. ఆమెతో ఇంటి స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉందో చూపించే స‌రికి అరియానా క‌న్నీరు పెట్టుకుంది. నేను కెప్టెన్ అయ్యాక అంద‌రి ప్ర‌వ‌ర్త‌న మారింది. స‌ర్‌, నేను మోనాల్ ని రేష‌న్ మేనేజ‌ర్ చేయ‌డం త‌ప్పా అంటూ నాగార్జున ద‌గ్గ‌ర త‌న బాధ చెప్పుకుంది అరియానా. దీనికి స‌మాధానం ఇచ్చిన నాగ్‌.. టాప్ పొజీష‌న్‌లో ఉన్న వాళ్ళ‌కి ఇలాంటివి ఎద‌రవుతూనే ఉంటాయ‌ని ధైర్యం ఇచ్చారు.  మొత్తానికి సీక్రెట్ వీడియోల ద్వారా అంద‌రి బాగోతం బ‌య‌ట ప‌డింది.


logo