గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 09:42:22

అఖిల్‌,అభిజిత్‌ల‌పై కొర‌డా ఝళిపించిన నాగ్

అఖిల్‌,అభిజిత్‌ల‌పై కొర‌డా ఝళిపించిన నాగ్

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో శ‌నివారం ఎపిసోడ్ చాలా సీరియ‌స్‌గా సాగింది. రూల్స్‌ని బ్రేక్ చేసిన ఇంటి సభ్యుల‌కు బిగ్ బాస్ అక్షింత‌లు వేయ‌గా, ఆ త‌ర్వాత కొంద‌రిని నాగ్ హెచ్చ‌రించారు. ఇక అనారోగ్యం వ‌ల‌న  గంగ‌వ్వ ఇంటికి ప‌య‌న‌మయ్యేందుకు సిద్దం కావ‌డంతో ఇంటి స‌భ్యులంద‌రు చాలా ఎమోష‌నల్ అయ్యారు. అయితే బిగ్ బాస్ షోకి రోజురోజుకు ఆద‌రణ పెరుగుతూ పోతుంద‌ని, ఈ వారం 8 కోట్ల ఓట్లు వ‌చ్చాయ‌ని నాగార్జున చెప్ప‌డంతో హౌజ్‌మేట్స్ అంద‌రు చాలా సంతోషించారు.

శ‌నివారం ఎపిసోడ్‌లో ముందు రోజు ఏం జ‌రిగిందో మ‌న టీవీలో చూపించారు నాగార్జున‌. ఇంటి నియ‌మాల‌ని స‌రిగా పాటించ‌ని కార‌ణంగా నిద్ర మ‌ధ్య‌లో లేపి అంద‌రిని లివింగ్ ఏరియాలోకి ర‌మ్మ‌ని చెప్పారు బిగ్ బాస్ . ఎన్నిసార్లు హెచ్చ‌రించినా కూడా అదే త‌ప్పు మ‌ళ్ళీ మ‌ళ్ళీ చేస్తున్నారు.ఇంకోసారి ఎవ‌రైన‌ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ఇంటి కెప్టెన్ అన్ని కెమెరాల‌కు క్ష‌మించమ‌ని చెప్పాల్సి ఉంటుందని ఆదేశించాడు. అనంత‌రం ఒప్పో టాస్క్ ఆడించారు బిగ్ బాస్.

ఈ టాస్క్‌లో మోస్ట్ స్టైలిష్ ప‌ర్స‌న్ - మెహ‌బూబ్‌, ప‌ర్ఫెక్ట్ పిక్చ‌ర్ - అరియానా, మోస్ట్ స్పీడీ - లాస్య‌, మోస్ట్ హైలెటెడ్ ఇన్ ద క్రౌడ్ - అవినాష్‌, మోస్ట్ క్లియ‌ర్ ఇన్ థాట్ - కుమార్ సాయి, బాగా శ‌క్తివంతులు - అమ్మ‌రాజ‌శేఖ‌ర్ అని పేర్కొన్నారు. మోనాల్‌ను ఆల్‌రౌండ‌ర్‌గా పేర్కొంటూ ఆమెకు కెప్టెన్ సోహైల్ కిరీటం పెట్టాడు. అనంత‌రం నాగార్జున ఇంటి స‌భ్యుల‌ని ప‌ల‌కరించాడు. ఆ త‌ర్వాత గ‌త వారం ఎవ‌రెవ‌రు ఏమేం త‌ప్పులు చేశారో వారికి చుర‌క‌లు అంటించాడు.

నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా అఖిల్‌, అభిజిత్‌లు మ‌ధ్య‌లో మోనాల్‌ని తీసుకురావ‌డాన్ని ఖండించాడు. మోనాల్ పేరుని తీసుకురావ‌డం నాకు న‌చ్చ‌లేదు అని అభి అన‌గా, న‌చ్చ‌న‌ప్పుడు ఎందుకు  ఆ టాపిక్ కొన‌సాగించావు అని కొర‌డా ఝుళిపించారు. ఇద్ద‌రిపై నాగ్ ఫైర్ కావడంతో వారు చివ‌రికి క్ష‌మాప‌ణ‌లు కోరారు. ఇక స్వాతి దీక్షిత్ నామినేష‌న్ స‌మ‌యంలో నోయ‌ల్- రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్ధ‌ల‌కు నాగార్జున త‌నదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. ఎవ‌ర‌న్నా చెప్పేది విన్న త‌ర్వాత డెసిష‌న్ తీసుకోవాల‌ని అన్నారు. అవినాష్‌కు మీరు ఇచ్చిన ధైర్యం చాలా బాగుంది అంటూ మాస్ట‌ర్‌ను కొనియాడారు నాగ్.

ఇక సోహైల్ ప్ర‌వ‌ర్త‌న‌పై మ‌రో సారి కొర‌డా ఝుళిపించారు నాగార్జున‌. దివిపై అరుపులు ఏంటి?  పిచ్చి కుక్క అరుస్తున్న‌ట్టు ఉంది . ఆడ‌పిల్ల‌పై అలా అర‌వ‌కూడ‌దు అని వార్నింగ్ ఇచ్చారు. ఇక మెహ‌బూబ్ పుచ్చె ప‌గులుద్ధి అన్న మాట‌కు నాగార్జున చాలా సీరియ‌స్ అయ్యారు. హోట‌ల్‌లో ఇలాంటి మాట‌లు మాట్లాడితే పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్ళి మోకాళ్లు విర‌గ్గొడ‌తారు, అలాంటి మాట‌లు ఇంకెప్పుడు మాట్లాడొద్దు అంటూ మెహ‌బూబ్‌కి చుర‌క‌లు అంటిచారు నాగ్.

ఇక  గేమ్ ని కొన‌సాగించ‌కుండా అడ్డుప‌డ్డుతున్నావంటూ అభిజిత్‌పై మండిప‌డ్డారు నాగార్జున‌. కొంచెం ఓపిక‌తో ఆడితే స్టార్స్ రావొచ్చు, లేదంటే బిగ్ బాస్ కొత్త‌గా ఏమైన చెప్తారేమో.. హారిక మూడు సార్లు కెమెరా ముందుకు వ‌చ్చి నేను ఒక్క‌టే స్టార్ ఇచ్చాన‌ని చెప్ప‌డంతోనే విజేత‌లుగా అతిథులు టీం గెలిచార‌ని నాగార్జున పేర్కొన్నారు.  ఇక ఈ రోజు సండే కావ‌డంతో ఫ‌న్‌తో పాటు ఓ వ్య‌క్తి ఎలిమినేట్ కానున్న‌ట్టు తెలుస్తుంది. 


logo