మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 15, 2020 , 09:39:17

నాగార్జున ప‌ర్‌ఫార్మెన్స్‌కు క‌న్నీరు పెట్టుకున్న అఖిల్

నాగార్జున ప‌ర్‌ఫార్మెన్స్‌కు క‌న్నీరు పెట్టుకున్న అఖిల్

దీపావ‌ళి రోజు కూడా హౌజ్‌మేట్స్‌కు చీవాట్లు త‌ప్ప‌లేదు. అర్ధ‌రాత్రి ఇచ్చిన టాస్క్‌ని స‌రిగా ఆడ‌నందున వారిపై మండిప‌డ్డ నాగ్, ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యుల‌తో ఆట‌లాడించారు. త్వ‌ర‌గా ఆరిపోయే చిచ్చుబుడ్డి, అంద‌ర్నీ షేక్ చేసే ఆటంబాంబు ఎవ‌రో చెప్పాలంటూ నాగ్ పేర్కొన్నారు. దీనికి  మెహ‌బూబ్.. అరియానా చిచ్చుబుడ్డి, అభిజిత్ ఆటంబాంబు అని అన్నాడు ఇక అరియానా..  మెహ‌బూబ్‌ను చిచ్చుబుడ్డి,  అవినాష్ ఆటంబాంబు అని చెప్పకొచ్చింది. సోహైల్‌.. అరియానా చిచ్చుబుడ్డి, అభి ఆటంబాంబ్ అని అన్నాడు. ఇక  మోనాల్‌.. సోహైల్ చిచ్చుబుడ్డి, అభి ఆటంబాంబ్ అని పేర్కొన‌గా, అభి.. సోహైల్ చిచ్చుబుడ్డి, మెహ‌బూబ్ ఆటంబాంబు అని  హారిక‌.. సోహైల్  చిచ్చుబుడ్డి , తానే ఆటంబాంబు అని సెల్ఫ్ డ‌బ్బా కొట్టుకోవ‌డంతో సెల్ఫ్ డ‌బ్బా చాలు కాని వేరే వాళ్ళ‌కు ఇవ్వు అన‌డంతో అంతా ఎగిరి గంతులేశారు. చివరికి మెహ‌బూబ్‌కు ఆటంబాంబు ఇచ్చింది. ఇక లాస్య‌.. సోహైల్‌కు చిచ్చుబుడ్డి, అభికి ఆటంబాంబు ఇచ్చింది.అవినాష్‌.. మోనాల్ చిచ్చుబుడ్డి, అరియానా ఆటంబాంబు అని చెప్పాడు.  

ఇక చిన్న బ్రేక్ త‌ర్వాత సీక్రెట్ రూంలో ఉన్న అఖిల్‌తో మాట్లాడిన నాగార్జున‌.. నువ్వు చాలా స్ట్రాంగ్ క‌దా, అన్ని విష‌యాల‌లో డిఫెండ్ చేసుకుంటావు. ఇక్క‌డ మాత్రం వాళ్లు వెళ్లిపో అన‌గానే వ‌చ్చేసావు ఏంట‌ని నాగ్ అన్నాడు. దీనికి స‌మాధానం ఇచ్చిన అఖిల్.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో బ‌య‌ట‌కు పంప‌రు అనే న‌మ్మ‌కం నా మ‌న‌సులో ఉంది. బ‌య‌ట‌కు అయితే పంప‌రు అనుకున్నా అని చెప్పాడు. అయితే దీనిపై స్పందించిన నాగార్జున నీ అంచ‌నా త‌ప్పింది. చాలా భాష‌ల‌లో కంటెస్టెంట్స్‌ను ఇలానే పంపించారు. నువ్వు బ్యాగ్ స‌ర్దుకొని వ‌చ్చేయ్. హౌజ్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్‌తో సెల్ఫీ దిగి స్టేజ్ మీదకు రా అన‌డంతో అఖిల్ చాలా ప్రాధేయ‌పడ్డాడు. అయిన నాగ్ కరుణించ‌లేదు. బ్యాగ్ స‌ర్ధుకొని ఫాస్ట్‌గా వ‌చ్చేయ్ అని అన్నాడు.  


logo