హిమాల‌యాల్లో ' వైల్డ్ డాగ్' టీం..ఫొటోలు వైర‌ల్

Oct 29, 2020 , 19:36:22

టాలీవుడ్ యాక్ట‌ర్ నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం  'వైల్డ్ డాగ్ '‌. అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ ప్రాజెక్టు హిమాల‌యన్ ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌లే హిమాల‌యాస్ లోని రోహ‌తంగ్ పాస్ లో వైల్డ్ డాగ్ షూట్ లొకేష‌న్ నుంచి నాగార్జున ఓ వీడియో షేర్ చేసుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా వైల్డ్ డాగ్ నుంచి తొలిసారిగా టీం మెంబ‌ర్స్ అంతా ఉన్న ఫొటోలు విడుద‌ల‌య్యాయి.

నాగార్జున, స‌యామీ ఖేర్, అలీ రెజా, మ‌యాంక్ ప్ర‌కాశ్ స‌హా మ‌రో స‌భ్యుడు ఉన్న స్టిల్స్ ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వైల్డ్ డాగ్ అండ్ టీం ఫారెస్ట్ ప్రాంతంలో యుద్ద స‌న్నివేశాల్లో పాల్గొంటున్న‌ట్టు ఫొటోలు చూస్తే అర్థ‌మ‌వుతుంది.  'హిమాల‌యాల్లో వైల్డ్ డాగ్ టీం..స్వేచ్చ‌ను, ప్ర‌కృతిని ప్రేమిస్తూ.. 'అంటూ ఫొటోల‌ను ట్విట‌ర్ లో షేర్ చేసుకున్నాడు నాగార్జున‌. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD