బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చధా.
టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య ఈ ప్రాజెక్టులో కీ రోల్ చేస్తున్నాడు. చైతూ ఆర్మీ జవాన్ గా కనిపించబోతున్నట్టు బీటౌన్ టాక్. తాజాగా ఈ మూవీ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. నాగచైతన్య జులై 7 (బుధవారం) నుంచే తన పాత్ర కోసం షూటింగ్ లో జాయిన్ అయ్యాడని బాలీవుడ్ వర్గాల సమాచారం.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అమీర్ ఖాన్ స్నేహితుడిగా కనిపించనున్నాడట చైతూ. వచ్చే 20 రోజులపాటు చిత్రీకరణ కొనసాగనుంది. కరీనాకపూర్ ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఆర్మీ జవాన్ పాత్ర కోసం చైతూ ఇప్పటికే తన బాడీ షేప్‌ను మరింత డెవలప్ చేసుకున్నాడు. 1994లో వచ్చిన అమెరికన్ డ్రామా ఫారెస్ట్ గంప్‌కు రీమేక్ గా తెరకెక్కుతున్నది లాల్ సింగ్ చధా.
ఇవి కూడా చదవండి..
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్