యువ హీరో నాగచైతన్య ‘లాల్‌సింగ్‌చద్దా’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ నటిస్తున్న ఈ చిత్రానికి అద్వైత్‌చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం లడఖ్‌లో జరుగుతున్న షూటింగ్లో నాగచైతన్య పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమిర్‌ఖాన్‌తో కలిసి తీయించుకున్న ఓ ఫొటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు నాగచైతన్య.