బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Feb 13, 2020 , 23:25:47

నాగశౌర్య కొత్త చిత్రం

నాగశౌర్య కొత్త చిత్రం

నాగశౌర్య కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రీతూవర్మ కథానాయిక. ఈ చిత్రం ద్వారా లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘ఈ నెల 19 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. నాగశౌర్యను కొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, ఎడిటర్‌: నవీన్‌నూలి, ఆర్ట్‌: ఏ.ఎస్‌.ప్రకాష్‌, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్‌, దర్శకత్వం: లక్ష్మీసౌజన్య.logo