గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 22, 2020 , 15:17:10

హౌస్ అరెస్ట్‌.. ఆవ‌కాయ ప‌చ్చ‌డి నేర్చుకున్న యంగ్ హీరో

హౌస్ అరెస్ట్‌.. ఆవ‌కాయ ప‌చ్చ‌డి నేర్చుకున్న యంగ్ హీరో

జ‌న‌తా క‌ర్ఫ్యూ ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో దేశం మొత్తం తస్తంభించిపోయింది. ప్ర‌జ‌లంద‌రు వారి వారి ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు.సెల‌బ్రిటీలు కూడా ఈ క‌ర్ఫ్యూకి అతీతులేమి కాద‌ని చెప్ప‌డంతో అంద‌రు ఇంట్లోనే ఫ్యామిలీతో స‌ర‌దా టైం స్పెండ్ చేస్తున్నారు. యంగ్ హీరో నాగ‌శౌర్య అయితే త‌న త‌ల్లి ద‌గ్గ‌ర ఆవ‌కాయ ప‌చ్చ‌డి ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేస్తూ పేర్కొన్నాడు. ఇటీవ‌ల అశ్వ‌థ్థామ చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి ముందు వ‌చ్చిన ఈ హీరో త‌న త‌ర్వాతి సినిమాకి సంబంధించి క‌థ‌లు వింటున్నాడు. త్వ‌ర‌లో త‌దుప‌రి ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడు. logo