ఆదివారం 23 ఫిబ్రవరి 2020
శేఖ‌ర్ క‌మ్ముల‌కి చైతూ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్

శేఖ‌ర్ క‌మ్ముల‌కి చైతూ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్

Feb 15, 2020 , 12:01:41
PRINT
శేఖ‌ర్ క‌మ్ముల‌కి చైతూ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్

సాయిపల్లవి, నాగచైతన్య జంటగా  శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం లవ్ స్టోరీ .  ఈ చిత్రంలో  తెలంగాణ యువకుడిగా  క‌నిపించ‌నున్నాడు చైతూ. రీసెంట్‌గా చిత్రానికి సంబంధించి  ఏయ్‌పిల్లా మ్యూజిక‌ల్ రివ్యూ అంటూ ఓ వీడియో విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఈ  వీడియోకి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మేర‌కు నాగ‌చైత‌న్య త‌న ద‌ర్శ‌కుడికి  కాస్ట్‌లీ క‌ళ్ళ‌ద్ధాల‌ని బ‌హుమ‌తిగా ఇచ్చాడు. ఈ విష‌యాన్ని శేఖ‌ర్ క‌మ్ముల త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ.. నాగ‌చైత‌న్య‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. అలానే త‌ర్వాత టీజ‌ర్‌కి మ‌రో గిఫ్ట్ సిద్ధంగా ఉంచుకోమ‌ని ఫన్నీ ట్వీట్ చేశారు. స‌మ్మర్‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. 


 


logo