గురువారం 04 జూన్ 2020
Cinema - May 02, 2020 , 14:32:53

ప‌వ‌న్‌,నాని, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో బ‌డా చిత్రం..!

ప‌వ‌న్‌,నాని, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో బ‌డా చిత్రం..!

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మ‌ల్టీ స్టార‌ర్ ట్రెండ్ ఊపందుకుంది. భారీ బ‌డ్జెట్‌తో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు తెర‌కెక్కించేందుకు నిర్మాత‌లు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ వంటి బ‌డా ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో తెర‌కెక్కుతుండ‌గా, త్వ‌ర‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ రూపొంద‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇందుకోసం నాని, నాగ చైత‌న్య‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌లిసి ప‌ని చేయ‌నున్నారు.

నాగ చైత‌న్య ప్ర‌ధాన పాత్ర‌లో సంతోషం ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ తెర‌కెక్కించ‌నున్న చిత్రాన్ని నాని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ క‌లిసి నిర్మించ‌నున్నార‌ట‌. నాని, ప‌వ‌న్‌కి ప్ర‌త్యేక బేన‌ర్స్ ఉండ‌గా త్రివిక్ర‌మ్‌కి హారిక్ అండ్ హాసిని క్రియేష‌న్స్ ఫండ్ స‌మ‌కూర్చ‌నుంద‌ట‌. ఈ ముగ్గురు క‌లిసి చైతూతో చిత్రం చేయ‌నున్న‌ట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే . నాగ చైత‌న్య ప్ర‌స్తుతం ల‌వ్ స్టోరీ అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 


logo