గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 19:09:08

వెంకీ అట్లూరి దర్శకత్వంలో చైతు సినిమా?

వెంకీ అట్లూరి దర్శకత్వంలో చైతు సినిమా?

అక్కినేని నాగచైతన్య మరో స్పోర్ట్స్‌ బేస్డ్‌ డ్రామాలో తెరపై కనిపించనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. నాగచైతన్య తన రాబోయే సినిమాల కోసం దర్శకులు నందిని రెడ్డి, మోహన కృష్ణ ఇంద్రగంటితో చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సైతం ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం చైతుతో వెంకీ చర్చలు జరుపుతున్నాడు. స్పోర్ట్స్‌ బేస్డ్‌ కథను సిద్ధం చేసి ఇటీవల చైతను కలిసి స్క్రిప్ట్‌ను కూడా చెప్పారు. తన క్యారెక్టర్‌ నచ్చడంతో చైతు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అంతా అనుకున్నట్లు జరిగితే.. నాగచైతన్య హీరోగా.. సూర్యదేవర నాగ వంశీ నిర్మాణ సారథ్యంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే వెంకీ అట్లూరి ప్రస్తుతం రొమాంటిక్ మూవీ ‘రంగ్‌ దే’లో తెరకెక్కించాడు. నితిన్‌, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం చైతు ‘లవ్‌ స్టోరీ’ చిత్రంలో సాయి పల్లవి కథా నాయిక. కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరు వరకు షూటింగ్‌ పూర్తి చేసుకోనుంది. ఆ తర్వాత ఆయన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo