గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 19, 2020 , 18:56:58

ఓటీటీపై చైతు అభిప్రాయమిదేనా?

ఓటీటీపై చైతు అభిప్రాయమిదేనా?

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన ఫిదా ఫేమ్ సాయిపల్లవి జంటగా నటిస్తోంది. కరోనా మహమ్మారి లేకుంటే ఈ చిత్రం విడుదలకు సిద్ధమయ్యేది. మూవీకి సంబంధించి షూటింగ్‌ చాలా వరకు పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న మిగతా చిత్రీకరణను సైతం ఇటీవల రామోజీఫిలిం సిటీలో కొవిడ్‌ నిబంధనల మేరకు షూటింగ్ పూర్తి చేశారు. అయితే తాజాగా చిత్రం విడుదలపై ఆసక్తికర వార్త ఒకటి ప్రచారం జరుగుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫాంలు చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇందుకు లాభదాయకమైన ఒప్పందానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

నిర్మాతలైతే ఆసక్తి చూపనప్పటికీ.. చైతు సైతం ఓటీటీలో విడుదలకు విముఖంగా ఉన్నట్లు తెలిసింది. థియేటర్‌లోనే విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. గత ఆరు నెలలుగా కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ నుంచి నేటికీ థియేటర్లు తెరుచుకోవడం లేదు. రాబోయే రోజుల్లో సైతం సినిమా హాళ్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పలు భారీ సినిమాలు సైతం ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నాయి. చైతు ఓటీటీ వైపు మొగ్గు చూపుతాడా? లేదంటే థియేటర్లు ఓపెన్‌ అయ్యే వరకు ఆగుతాడా? వేచి చూడాల్సిందే.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo