ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 26, 2021 , 07:18:11

నానిని ఢీ కొట్ట‌బోతున్న నాగ చైత‌న్య‌

నానిని ఢీ కొట్ట‌బోతున్న నాగ చైత‌న్య‌

క‌రోనా ఎఫెక్ట్‌తో దాదాపు ఎనిమిది నెల‌లుగా మూత‌ప‌డ్డ థియేట‌ర్స్ ఇటీవ‌ల తెరచుకున్నాయి. దీంతో రిలీజ్‌కు సిద్ధంగా సినిమాలు పెద్ద తెర‌పై ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యేందుకు క్యూ క‌ట్టాయి. రీసెంట్‌గా క్రాక్ చిత్రం థియేట‌ర్స్‌లో విడుద‌ల కాగా, ఇది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. ఇక రానున్న రోజుల‌లో ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదం అందిచేందుకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో భాగంగా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ల‌వ్ స్టోరీ చిత్రం ఏప్రిల్ 16న థియేట‌ర్స్‌లోకి రానుంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. 

ఫిదా త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌వ్ స్టోరీ కాగా, ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ‘లవ్ స్టోరి’లో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. పవన్ సీహెచ్ సంగీతం సమకూర్చారు. ఏప్రిల్ 16న విడుద‌ల కానున్న నాని ట‌క్ జ‌గ‌దీష్‌కు పోటీగా ల‌వ్ స్టోరీ చిత్రం విడుదల కానుంది. ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని శివ నిర్వాణ తెర‌కెక్కించారు. ఈ రెండు చిత్రాల‌లో ఏ మూవీ మంచి విజ‌యం సాధిస్తుందో చూడాలి. 

VIDEOS

తాజావార్తలు


logo