బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 09, 2020 , 09:59:47

తెలంగాణ పోలీసుల‌కి స‌లాం కొట్టిన అక్కినేని హీరో

తెలంగాణ పోలీసుల‌కి స‌లాం కొట్టిన అక్కినేని హీరో

భ‌యంక‌ర మృత్యు మ‌హ‌మ్మారి క‌రోనాని క‌ట్టిడి చేసేందుకు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు తెగించి మ‌రీ వారి వారి విధులు నిర్వ‌ర్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న ప్ర‌జ‌లంద‌రు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మైనప్ప‌టికీ, అత్య‌వ‌స‌ర సేవ‌ల విభాగంకి సంబంధించిన వీరు మాత్రం ప్ర‌తి రోజు త‌మ విధుల‌ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తూ ప్ర‌జ‌ల‌ని కాపాడుతూ వ‌స్తున్నారు. అయితే శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు నిర్వహిస్తున్న విధులను తెలంగాణ సమాజం కొనియాడుతోంది.

తాజాగా అక్కినేని హీరో నాగ చైత‌న్య.. పోలీసుల‌ని ప్ర‌శంసిస్తూ వీడియో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించడంలో భాగంగా గత రెండు, మూడు వారాల్లో మన ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది. చాలా త్వరగా చర్యలు చేపట్టడం వల్ల ఈ వైరస్ ఎక్కువగా ప్రబలలేదు. మనం బావున్నాం, ఈ రాష్ట్రం చాలా బావుంది. నేను కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు ప్రజల రక్షణ‌ కోసం తీసుకుంటున్న చర్యలను గమనించాను. ప్రజల సంక్షేమం కోసం పోలీసులు వారి ప్రాణాలను, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసు శాఖను అభినందిస్తున్నాను. ఓ రకంగా చెప్పాలంటే ప్రతి పౌరుడికి వారెంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారందరికీ సెల్యూట్ చేస్తున్నాను'' అని నాగచైతన్య తెలిపారు. 

చైతూ వీడియోని తెలంగాణ పోలీస్ త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. మీరు చెప్పిన మాట‌లు మాకు మ‌రింత బ‌లాన్ని ఇచ్చాయి. సొసైటీ కోసం పోలీస్ సేవ చేయాల‌నే సిద్ధంతాన్ని మేము న‌మ్ముతున్నాము. మీరు మాపై కురిపించిన ప్ర‌శంసలు అన్నీ మ‌రచిపోయేలా చేసింది. ప్ర‌జ‌ల‌ని చైత‌న్యం చేసే విధంగా మ‌రింత ముందుకు వెళతాం అని పోలీస్ శాఖ త‌మ ట్విట్టర్‌లో పేర్కొన్నారు .

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo