naga chaitanya and samantha | ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా కొన్ని రోజులుగా సమంత, నాగ చైతన్య గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఇప్పటి వరకు అధికారికంగా వాళ్లిద్దరూ ఏ రోజు కూడా మీడియా ముందు స్పందించలేదు. సోషల్ మీడియాలో కనీసం దానిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నారు. నాగ చైతన్య తన లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. మరోవైపు సమంత చెన్నైకి వెళ్లి అక్కడ సినిమా చేసుకుంటుంది. అక్కినేని కుటుంబంలో జరుగుతున్న వేడుకలకు గాని.. పార్టీలకు గాని సమంత హాజరు కావడం లేదు.
దీన్ని బట్టి ఏదో జరుగుతుంది అని అనుమానం మాత్రం అక్కినేని అభిమానుల్లో బలంగా వస్తుంది. లవ్ స్టోరీ ప్రమోషన్స్‌లో కూడా సమంత గురించి ఎలాంటి ప్రశ్నలు అడగకూడదని మీడియాకు కండిషన్ పెట్టాడు నాగ చైతన్య. కొంతమంది దీని గురించి అడిగినా కూడా దాటవేసే సమాధానం చెప్పాడు.. కానీ క్లారిటీ అయితే ఇవ్వలేదు. తమ గురించి ఎవరు ఏది రాసుకున్న పట్టించుకునే సమయం తనకు లేదని.. తనకు చాలా పనులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. మరోవైపు సమంత కూడా ఈ విషయం గురించి ఎక్కడ మాట్లాడడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఈ జంటపై మరో వార్త కూడా వైరల్ అవుతుంది.
త్వరలోనే తమ జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం అభిమానుల ముందు ఉంచబోతున్నారని.. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తోంది. అది ఎలాంటి నిర్ణయం అయి ఉంటుంది అని అక్కినేని అభిమానులు కంగారు పడుతున్నారు. కలిసి జీవించడానికి కాంప్రమైజ్ అయ్యారా.. లేదంటే నిజంగానే సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్లు విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. అక్టోబర్ 6న చైతు సమంత 4వ వివాహ వార్షికోత్సవ వేడుక జరగనుంది. ఆ రెండు మూడు రోజుల్లోనే తమ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం చెప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే అభిమానులు కూడా అక్టోబర్ 6 కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ప్రసంగంతో చిరంజీవి అప్ సెట్ అయ్యాడా..?
Mohanbabu | నువ్వడిగిన ప్రతీ మాటకు సమాధానమిస్తా: పవన్ స్పీచ్ పై మోహన్ బాబు
పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇండస్ట్రీకి లాభమా.. నష్టమా..?
పవన్ కళ్యాణ్ స్పీచ్ | ఇండస్ట్రీలో వేడి రాజుకుంది.. నాని ముందుకొచ్చాడు..
Nagarjuna: హౌస్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లు ఎవరో చెప్పాలంటూ హౌజ్‌మేట్స్‌కి నాగ్ ప్రశ్న