అదిరే అభి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వైట్‌పేపర్’. శివ దర్శకుడు. గ్రందే శివ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 9గంటల 51 నిమిషాల వ్యవధిలో పూర్తిచేశారు. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను నటుడు నాగబాబు విడుదల చేశారు. సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు వున్నాయని, అదిరే అభి నటన చిత్రానికి హైలైట్‌గా వుంటుందని దర్శకుడు తెలిపారు. వాణి, తల్లాడ సాయికృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: నవనీత్‌చారి.