బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 08:01:38

వ‌రుణ్ తేజ్ పెళ్లిపై నోరు విప్పిన నాగ‌బాబు

వ‌రుణ్ తేజ్ పెళ్లిపై నోరు విప్పిన నాగ‌బాబు

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు డిసెంబ‌ర్ 9న త‌న కూతురు నిహారిక వివాహాన్ని ఉద‌య్ పూర్ ప్యాలెస్ వేదిక‌గా అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిపించిన సంగ‌తి తెలిసిందే. ఈ వివాహ వేడుక‌కు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా హాజరు కావ‌డంతో పెళ్లి వేడుక‌ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.  ఇక నిహారిక పెళ్లి పూర్తి కావ‌డంతో అభిమానులు వ‌రుణ్ తేజ్ పెళ్లెప్పుడు అంటూ ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు. 

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వ‌రుణ్ తేజ్ పెళ్లెప్పుడు అనేది స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని నాగ‌బాబు  నా కొడుకు  ప్రేమ వివాహం చేసుకున్నా ప‌ర్లేదు, పెద్ద‌లు కుదిర్చిన వివాహం చేసుకున్నా ప‌ర్లేదు. అమ్మాయి అన్నివిధాలా వరుణ్ కి సరిజోడీనా కాదా అన్నదే చూస్తాం అని నాగ‌బాబు స్ప‌ష్టం చేశాడు. ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్ బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న గ‌ని అనే చిత్రంతో పాటు ఎఫ్‌2కు సీక్వెల్‌గా ఎఫ్ 3 అనే సినిమా చేస్తున్నాడు. 

VIDEOS

logo