గురువారం 28 మే 2020
Cinema - May 20, 2020 , 09:31:54

గాంధీ అంటే గౌర‌వం.. తప్పుగా అర్ధం చేసుకున్నారు: నాగబాబు

గాంధీ అంటే గౌర‌వం.. తప్పుగా అర్ధం చేసుకున్నారు:  నాగబాబు

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మే 19న నాధురాం గాడ్సే జ‌యంతిని పుర‌స్క‌రించుకొని సంచ‌ల‌న ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. ‘ఈ రోజు నాథురాం గాడ్సే పుట్టినరోజు. గాంధీని చంపడం కరెక్టా ?కాదా? అనేది  చర్చనీయాంశమే.  కానీ అతనివైపు అర్గ్యూమెంట్‌ని ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. గాంధీని చంపితే అపఖ్యాతి పాలౌతానని తెలిసినా తను అనుకున్నది చేశాడు. కానీ నాథురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. నాథురాం పుట్టినరోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తుచేసుకోవాలనిపించింది. పాపం నాథురాం గాడ్సే’ అంటూ  నాగబాబు ట్వీట్‌ చేశారు. అంతేకాదు నాథురాం గాడ్సే మరణ వాంగ్మూల అనువాదానికి సంబంధించిన  ఓ వీడియోను పోస్ట్‌ చేశారాయన. గాడ్సే గురించి సోషల్‌మీడియాలో నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. 

ఈ నేప‌థ్యంలో నాగ‌బాబు మ‌రో పోస్ట్ ద్వారా స్పందించారు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు.నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను.నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం.ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అంటూ గాడ్సే పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు నాగ‌బాబు.


logo