అక్కినేని నాగార్జున చివరిగా వైల్డ్ డాగ్ అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. జెట్ స్పీడ్ తో సాగుతున్న షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. మళ్లీ ఎట్టకేలకు సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించారు. షూటింగ్ పునః ప్రారంభం అయ్యిందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ ఫొటోను యూనిట్ సభ్యులు షేర్ చేశారు.
ఈ చిత్రంలో నాగ్ రా ఏజెంట్‌గా కనిపించనున్నట్టు సమాచారం. ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు కఠినమైన ఫైరింగ్ సీన్స్ కూడా ఉంటాయట. నాగార్జున బెస్ట్‌గా ఈ చిత్రం ఉంటుందని టాక్. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని చాలా డిఫరెంట్‌గా తీయబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా లో కాజల్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. వేశ్య పాత్రలో నటిస్తుందని ఇప్పటికే కొన్నిలీకులు వచ్చిన విషయం తెలిసిందే.
నాగ్ ఓ వైపు ఈ సినిమా చేస్తూనే మరోవైపు బంగార్రాజు సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే బంగార్రాజు సినిమా షూటింగ్ ను ప్రారంభించారు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై పూర్తి క్లారిటీ అయితే రాలేదు. నాగ చైతన్య కూడా ఇందులో కీలక పాత్ర చేయనుండగా, ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి,మోనాల్ కూడా నటిస్తారని సమాచారం.