మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 14, 2020 , 12:56:43

పుకార్ల‌కి చెక్ పెట్టిన నాగార్జున‌

పుకార్ల‌కి చెక్ పెట్టిన నాగార్జున‌

ఆరుప‌దుల వ‌య‌స్సులోను ఎంతో యాక్టివ్‌గా ఉంటూ కుర్ర హీరోల‌కు పోటి ఇస్తున్న నాగార్జున ప్ర‌స్తుతం బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4ని హోస్ట్ చేస్తున్నారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో సీఎం ని క‌లిసి సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించి ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. అయితే సీఎంని క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత చిరు త‌నకు క‌రోనా పాజిటివ్ అని ప్ర‌క‌టించ‌డంతో బిగ్ బాస్ షోకు కొద్ది రోజుల పాటు నాగ్ దూరంగా ఉంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

చిరంజీవితో నాగార్జున స‌న్నిహితంగా మెలిగాడ‌ని, ఈ కార‌ణంతో వెంట‌నే ఆయ‌న ఐసోలేష‌న్‌లోకి వెళ్ళాడ‌ని అన్నారు. అయితే ఐసోలేష‌న్‌లో ఉన్న కార‌ణంతో నాగ్ ఈ వారం బిగ్ బాస్ షోని హోస్ట్ చేయ‌డ‌ని,ఆయ‌న స్థానంలో చైతూ వ‌స్తాడ‌ని పుకార్లు షికారు చేశాయి. అన్నింటికి చెక్ పెడుతూ నాగ్ బిగ్ బాస్ స్టేజ్ పై దిగిన ఫొటోని షేర్ చేస్తూ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. దీంతో అంద‌రికి ఓ క్లారిటీ వ‌చ్చింది. ద‌స‌రా రోజు హౌజ్‌మేట్స్‌తో సంద‌డి చేయ‌లేక‌పోయిన నాగ్ ఈ రోజు రచ్చ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇదిలా ఉంటే చిరంజీవికి క‌రోనా సోక‌లేద‌నే విష‌యం తెలిసిందే. నాసిక‌రం కిట్స్ వ‌ల‌న అది పాజిటివ్ గా చూపించింది. 


logo