అభిజీత్‌కు క్లాస్ తీసుకున్న నాగార్జున.. అఖిల్ విషయంలో మోనాల్ హర్ట్..

బిగ్ బాస్ 4 తెలుగులో 9వ వారం ఎవరికి బయటికి వెళ్లబోతున్నారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించి చర్చ బాగా జరుగుతుంది. దాంతో పాటు ఇంట్లో జరిగిన వారం రోజుల విషయాలు చూసిన తర్వాత ఈ వేడిని చల్లార్చడానికి వీకెండ్ లో నాగార్జున వస్తాడు. అలాగే ఈ వారం కూడా వచ్చాడు. అయితే చల్లార్చలేదు సరికదా మరింత మంట పెట్టాడు నాగ్. వీచ్చా రాగానే అభిజీత్ కు తనదైన శైలిలో క్లాస్ తీసుకున్నాడు. మొన్న టాస్కులో భాగంగా మధ్యలోనే వెళ్లిపోవడం తప్పుగా చూపించాడు నాగార్జున. అసలు విషయం ఏంటంటే ఈ వారం అభిజీత్, అవినాష్, మోనాల్, హారిక, అమ్మ రాజశేఖర్ నామినేట్ అయ్యారు. వాళ్లను వాళ్లు సేవ్ చేసుకోడానికి బిగ్ బాస్ ఓ అవకాశం ఇచ్చాడు. అందులో భాగంగానే వాళ్లకు టాస్కు ఇచ్చాడు.
ఓ స్టాండ్ దగ్గర నిలబడి మిగిలిన ఇంటి సభ్యులు డిస్టర్బ్ చేస్తున్నా కూడా కదలకుండా అలాగే ఉండిపోవాలి. రెండుసార్లు తమ తల అక్కడ ఉంచిన స్టాండ్ నుంచి తీస్తే ఔట్ అన్నట్లు. ఈ క్రమంలోనే వాళ్లను అక్కడ్నుంచి కదిలించడానికి ఇంటి సభ్యులు ఏదైనా చేయొచ్చు. దానికోసం గుడ్లు, గడ్డి, ఐస్ ముక్కలు, నీళ్లు, మట్టి ఇలా చాలానే పెట్టాడు బిగ్ బాస్. వాటన్నింటినీ వాడుకుంటూ బయటికి పంపించేలా చేయాలి. అయితే ఈ పనులు అభిజీత్ కు అస్సలు నచ్చలేదు. అక్కడ తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఒప్పుకోవడం లేదంటూ బయటికి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ బిగ్ బాస్ పై కూడా నిందలు వేసాడు. దాంతో నాగార్జున పాయింట్ రైజ్ చేసాడు. అభి మొన్న నువ్వు టాస్క్ ఆడేటప్పుడు ఓ మాటన్నావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని.. అంటే ఇంట్లో మిగిలిన వాళ్లకు ఆత్మాభిమానం లేదా అంటూ ప్రశ్నించాడు.
దాంతో అభిజీత్ అందర్నీ ఉద్దేశించి ఈ మాట అన్నానని చెప్పాడు. కానీ అభి చేసింది కరెక్ట్ అని ఎంతమంది ఫీల్ అవుతున్నారని నాగార్జున అడిగితే ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదు. దాంతో అభి అలా ఒంటరి అయిపోయాడు. మరోవైపు మోనాల్ కూడా ఈ వారం చాలా సీరియస్ అయిపోయింది. ముఖ్యంగా మొన్నటి టాస్కులో అరియానా బిహేవ్ చేసిన తీరు చాలా దారుణంగా ఉందని చెప్పింది. అఖిల్ నుంచి కూడా ఈ తీరు ఊహించలేదని.. తాను ఓ ఫ్యామిలీ అనుకున్నానని చెప్పుకొచ్చింది మోనాల్. కానీ అతడు మాత్రం తనను నామినేట్ చేసాడని ఏడ్చేసింది మోనాల్. ఈ వారం చూస్తుంటే చాలా మందికి నాగార్జున సపరేట్ క్లాస్ తీసుకున్నాడని అర్థమైపోతుంది. మరి ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
తాజావార్తలు
- ఓయూ ప్రీ పీహెచ్డీ పరీక్షలు యథాతథం
- ప్రేమలో ఉన్నట్టు ఒప్పుకున్న రేణూ దేశాయ్
- నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
- అరియానా బర్త్‌డేలో సోహెల్, మోనాల్‌ల ముద్దు ముచ్చట్లు
- 28 నుంచి గ్రాండ్ నర్సరీ మేళా
- నానిని ఢీ కొట్టబోతున్న నాగ చైతన్య
- 27న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రద్దు
- ట్రేడింగ్.. చీటింగ్
- ఢిల్లీలో ఐదంచెల భద్రత
- గంజాయికి అలవాటుపడి దొంగతనాలు