శనివారం 06 జూన్ 2020
Cinema - May 18, 2020 , 10:41:29

ప్ర‌భాస్ సినిమా గురించి నాగ్ అశ్విన్ ముచ్చ‌ట్లు..!

ప్ర‌భాస్ సినిమా గురించి నాగ్ అశ్విన్  ముచ్చ‌ట్లు..!

మ‌హాన‌టి సావిత్రి జీవితాన్ని ఎంతో అందంగా తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్.  త్వ‌ర‌లో ఆయ‌న ప్రభాస్ హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అందులో భాగంగా నాగ్ అశ్విన్ ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్, త‌మిళం, మ‌ల‌యాళ స్టార్స్‌ని  తీసుకొవాలని చూస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. 

కొద్ది రోజులుగా చిత్రంకి సంబంధించి జోరుగా ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని, ఇందులో సామాన్య మానవుడు, దేవకన్య మధ్య ప్రేమకు గుర్తుగా పుట్టిన ఓ పిల్లాడి కథ ఆధారంగా సినిమా రూపొందుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు ఈ చిత్రం కోసం భారీ విఎఫ్ఎక్స్ ప‌నులు ఉండ‌నుండగా, వీటి కోసం 50 కోట్లు కేటాయించిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాపై నెటిజన్ అడిగిన ప్ర‌శ్న‌కి స‌మాధాన‌మిచ్చి నాగ్ అశ్విన్ .. ప్రభాస్ సరసన నటించే హీరోయిన్‌ గానీ, లేదా ఇతర పాత్రలను ఇంకా ఫైనల్ చేయలేదని పేర్కొన్నాడు.logo