శనివారం 06 జూన్ 2020
Cinema - May 18, 2020 , 06:23:36

థియేట‌ర్స్‌కి ర‌ప్పించేందుకు నాగ్ అశ్విన్ మ‌రో ఆలోచ‌న‌..!

థియేట‌ర్స్‌కి ర‌ప్పించేందుకు నాగ్ అశ్విన్ మ‌రో ఆలోచ‌న‌..!

లాక్‌డౌన్ పెరుగుతూ పోతున్న కొద్ది నిర్మాత‌ల‌లో ద‌డ మొద‌ల‌వుతుంది. థియేట‌ర్స్ తిరిగి ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియ‌క‌పోతుండ‌డంతో కొంద‌రు నిర్మాత‌లు ఓటీటీల వైపు మ‌క్కువ చూపిస్తున్నారు. అయితే ఒక‌వేళ థియేట‌ర్స్ ఓపెన్ అయిన ఎంత మంది ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కి వ‌చ్చి సినిమా చూసే అవ‌కాశం ఉంది. ఇంత‌క‌ముందులా ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కి క్యూ క‌డతారా, లేదంటే ప‌రిస్థితి ఏంటి? ఇలా ఎన్నో విష‌యాల‌పై చిత్ర ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప్ర‌ముఖులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

అయితే  ‘ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి’ చిత్రాల దర్శకుడు నాగ్‌ అశ్విన్ .. థియేట‌ర్స్‌కి ప్రేక్ష‌కుల‌ని ర‌ప్పించాలంటే ఏం చేయాల‌నే అంశంపై ట్విట్ట‌ర్‌లో నెటిజ‌న్స్‌తో చ‌ర్చ చేస్తున్నాడు. ఇంత‌క‌ముందు థియేట‌ర్స్‌లో బీర్, బ్రీజ‌ర్ వంటి స‌ప్లై చేస్తే ఎలా ఉంటుంద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన ఆయ‌న‌, తాజాగా డ్రైవ్ ఇన్ కాన్సెప్ట్ తెచ్చారు. పాత కాలం టూరింగ్ టాకీస్ లాగా, మ‌నం కారు లేదా బైక్ పార్క్ చేసిన చోట నుండే సినిమాని వీక్షించ‌వ‌చ్చు. ఈ డ్రైవ్ ఇన్స్ ఐడియా ఎలా ఉంటుంద‌ని నెటిజ‌న్స్‌ని అడిగారు. దీనిపై నెటిజ‌న్స్ ప‌లు ర‌కాలుగా స్పందించారు.

 


logo