సోమవారం 25 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 12:57:55

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

బెల్లంకొండ శ్రీనివాస్, న‌భాన‌టేశ్‌, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం అల్లుడు అదుర్స్. సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా నుంచి న‌దిలా న‌దిలా అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్ ను ఇటీవ‌లే మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా..మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఈ పాట‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. న‌దిలా న‌దిలా క‌దిలావే ఓ న‌దిలా..అల‌లా అల‌లా అల‌లా త‌డిపావే న‌న్ను ఇలా అంటూ సాగే ఈ పాటను క‌శ్మీర్‌, శ్రీన‌గ‌ర్ లోని అందమైన‌ మంచు ప‌ర్వ‌త ప్రాంతాల్లో బెల్లంకొండ‌ శ్రీనివాస్‌-న‌‌భా న‌టేశ్ మ‌ధ్య షూట్ చేశారు. ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ కోసం చాలానే క‌ష్ట‌ప‌డింది చిత్ర‌యూనిట్‌.

శ్రీన‌గ‌ర్, క‌శ్మీర్ లో భారీగా మంచు వ‌ర్షం కురుస్తున్నా లెక్క‌చేయ‌కుండా ఎంతో క‌ష్ట‌ప‌డి పాట‌ను షూట్ చేశారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్రఫీలో బెల్లంకొండ శ్రీనివాస్-న‌భా న‌టేశ్ ఓ వైపు క‌ష్ట‌పడుతూ..మ‌రోవైపు షూటింగ్ ను ఎంజాయ్ చేశారు. షూటింగ్ వీడియోను బీఏ రాజు ట్విట‌ర్ లో చేయ‌గా..నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

స్ర‌వంతి ర‌వికిశోర్ కు త్రివిక్ర‌మ్ పాదాభివంద‌నం

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

మ‌తి పోగొడుతున్న మిల్కీ బ్యూటీ..ఫొటోలు వైర‌ల్

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

12 కి.మీ సైకిల్ తొక్కిన‌ ర‌కుల్‌..ఎందుకంటే..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo