శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 13:15:26

చీర‌క‌ట్టులో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తున్న‌ ఇస్మార్ట్ భామ‌

చీర‌క‌ట్టులో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తున్న‌ ఇస్మార్ట్ భామ‌

పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల భామ న‌భా న‌టేష్‌. ఇందులో తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్ ఇచ్చింది. ఈ చిత్రం త‌ర్వాత న‌భాకు ఫ్యాన్ ఫాలోయింగ్ విప‌రీతంగా పెరిగింది. ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్‌తో క‌లిసి సోలో బ‌తుకే సో బెట‌ర్  , బెల్లంకొండ శ్రీనివాస్‌తో క‌లిసి అల్లుడు అదుర్స్  అనే చిత్రాలు చేస్తుంది.

తాజాగా ఈ అమ్మ‌డు చీర‌క‌ట్టులో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ఫోటోషూట్ చేసింది. ఇన్నాళ్ళు మోడ్ర‌న్ డ్రెస్‌లో క‌నువిందు చేసిన  న‌భా ఇలా చీర‌క‌ట్టులో మెరిసే స‌రికి అభిమానుల గుండెలు జారి గ‌ల్లంత‌య్యాయి. న‌భా అందాల‌ని తెగ ఆస్వాదిస్తున్న ఫ్యాన్స్ ఆమె ఫోటోల‌ని వైర‌ల్ కూడా చేస్తున్నారు.