బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 13:09:00

న‌భా న‌టేష్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన సాయి ధ‌ర‌మ్

న‌భా న‌టేష్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన సాయి ధ‌ర‌మ్

సుప్రీమ్  హీరో సాయి ధరమ్ తేజ్, ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి (SVCC) బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. లాక్ డౌన్ ప్ర‌భావంతో వాయిదా ప‌డ్డ ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ షురూ అయింది.

ఈ రోజుతో న‌భాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి కావ‌డంతో ఆమెకు సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో థ్యాంక్యూ న‌భా అని రాయ‌డంతో పాటు తెల్ల‌ని దుస్తులు, న‌భా ఫోటో ఫ్రేమ్, కొన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి. ఇవి చూసిన న‌భా తెగ ఫిదా అయింద‌ట‌.  ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల కానుందంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. కాగా, ఈ చిత్రంకి సంబంధించి విడుదలైన థీమ్ వీడియో, నో పెళ్లి అనే సాంగ్ తో పాటు  హే ఇది నేనేనా అనే సాంగ్స్  సినీ ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.


logo