సినిమాలతో పాటు డిజిటల్ వేదికల మీద అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నారు కథానాయికలు. పాత్రలపరంగా ప్రయోగాలకు వెబ్‌సిరీస్‌లను ఉత్తమమైన మార్గంగా భావిస్తున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా వంటి అగ్ర నాయికలు వెబ్‌సిరీస్‌లలో నటించి మెప్పించారు. తాజాగా వారి బాటలో అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది కన్నడ చిన్నది నభానటేష్. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అరంగేట్రం చేయబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో బ్రిటీష్ గూఢచర్య వెబ్‌సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ను హిందీలో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో నభానటేష్‌ను కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలిసింది. హిందీలో అరంగేట్రం చేస్తూనే హృతిక్ రోషన్ వంటి పెద్దహీరో సరసన అవకాశం సంపాదించుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది నభానటేష్.