ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Nov 01, 2020 , 13:05:04

రెండు నెల‌ల్లో షూటింగ్ ఫినిష్ చేయాలంటున్న సీనియ‌ర్ హీరో

రెండు నెల‌ల్లో షూటింగ్ ఫినిష్ చేయాలంటున్న సీనియ‌ర్ హీరో

క‌రోనా వ‌ల‌న చాలా స‌మ‌యం వృధా అయింది. సినిమా షూటింగ్‌ల‌న్నీ ఆగిపోవ‌డంతో ఎక్క‌డి ప్రాజెక్టులు అక్క‌డే అన్న‌చందంగా మారాయి. క‌రోనా ఉదృతి కాస్త త‌గ్గ‌డంతో చిరంజీవి,బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోలు త‌మ చిత్ర షూటింగ్‌లు మొద‌లు పెడుతున్నారు. ఇక విక్ట‌రీ వెంక‌టేష్ కూడా త‌న తాజా చిత్రం నారప్ప‌ని మొద‌లు పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడు.

వెంకటేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ధనుష్‌ నటించిన తమిళ చిత్రం‘అసురన్‌'కు రీమేక్‌ ఇది. డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్నారు.  తమిళనాడులోని తెరికాడు ఎర్ర ఏడారిలో  ‘పదిరోజుల పాటు యాక్షన్‌ ఘట్టాలు తీసారు. ఇవి సినిమాలో ప్రధానాకర్షణగా ఉంటాయని మేక‌ర్స్ అన్నారు.ఇక ఎనిమిది నెల‌ల త‌ర్వాత ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానుండ‌గా, ఈ సినిమాని రెండు నెల‌లో పూర్తి చేయాల‌ని వెంక‌టేష్ కండీష‌న్ పెట్టిన‌ట్టు తెలుస్తుంది. ఈ మూవీ షూటింగ్ త‌ర్వాత వెంక‌టేష్ ఎఫ్ 3 సినిమా చేయ‌నున్నాడు.జ‌న‌వ‌రిలో చిత్ర షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుంది.

VIDEOS

logo