మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 05, 2020 , 12:16:59

నాంది చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ లుక్ ఇదే..!

నాంది చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ లుక్ ఇదే..!

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న  చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్నారు. వినూత్న క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో వర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు ఆమె బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నాంది చిత్రం నుండి వ‌ర‌ల‌క్ష్మీ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో చీర‌క‌ట్టుతో అందంగా క‌నిపిస్తుంది.  ఈ సినిమా కోసం బ్రహ్మకడలి, ఛోటా.కె.ప్రసాద్‌, శ్రీచరణ్‌ పాకాల, అబ్బూరి రవి వంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ప‌ని చేస్తున్నారు.  సామాజిక అంశాలు మేళవించిన థ్రిల్లర్‌ సినిమా నాంది కాగా, ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది.  హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి  శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.


logo