ఆదివారం 23 ఫిబ్రవరి 2020
స‌క్సెస్‌ఫుల్‌గా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'నాంది'

స‌క్సెస్‌ఫుల్‌గా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'నాంది'

Feb 15, 2020 , 11:26:42
PRINT
స‌క్సెస్‌ఫుల్‌గా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'నాంది'

‘అల్లరి’ నరేష్‌ కథానాయకుడిగా ఎస్‌వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సతీష్‌ వేగేశ్న నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ‘క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇతివృత్తంతో తెరకెక్కుతుండ‌గా,  అల్ల‌రి న‌రేష్  కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ, కథనాలతో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమా కోసం  బ్రహ్మకడలి, ఛోటా.కె.ప్రసాద్‌, శ్రీచరణ్‌ పాకాల, అబ్బూరి రవి వంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ప‌ని చేస్తున్నారు.  సామాజిక అంశాలు మేళవించిన థ్రిల్లర్‌ సినిమాలో  వరలక్ష్మి శరత్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ప్రవీణ్‌, ప్రియదర్శి  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీచరణ్‌ పాకాల అందిస్తున్నారు. తాజాగా చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ పూర్తి చేసి స‌మ్మ‌ర్‌లో చిత్ర రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. 


logo