నివాస్, కారుణ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘నా..నీ ప్రేమకథ’. అముద శ్రీనివాస్ దర్శకుడు. శ్రవణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘చుప్పనాతి పిల్ల తిప్పుకుంటే ఎల్లా’ అనే పాటను గురువారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘టైటిల్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటను పూర్ణాచారి రచించగా, ప్రవీణ్‌కుమార్ ఆలపించారు. యువతను ఆకట్టుకునే అన్ని అంశాలున్న ప్రేమకథగా తెరకెక్కిస్తున్నాం. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. అజయ్‌ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎస్.కిరణ్, సంగీతం: ఎం.ఎల్.పి.రాజు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అముద శ్రీనివాస్.