ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 06, 2021 , 16:35:01

నా కొడుకు ఇప్పట్లో రాడు.. క్లారిటీ ఇచ్చిన మాస్ మహారాజా

నా కొడుకు ఇప్పట్లో రాడు.. క్లారిటీ ఇచ్చిన మాస్ మహారాజా

ఇండస్ట్రీ ఏదైనా కూడా వారసులకు మాత్రం కొదవ లేదు. ఇండియన్ సినిమాలో ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కలిపి దాదాపు 70 శాతం వారసులే ఉన్నారు. సొంతంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. తెలుగులో చూసుకుంటే ఒకప్పుడు చిరంజీవి.. ఆ తర్వాత రవితేజ. ఇప్పుడు నాని, విజయ్ దేవరకొండ మినహాయిస్తే వచ్చి స్టార్ డమ్ సంపాదించిన వాళ్లు తక్కువే. అలా వచ్చిన వాళ్లు ఇప్పుడు వాళ్ల వాళ్లకు బ్యాగ్రౌండ్ అవుతున్నారు. చిరంజీవి ఒక్కడు వచ్చిన తర్వాత ఆ కుటుంబం నుంచి దాదాపు 10 మంది హీరోలు వచ్చారు. నిన్నగాక మొన్నొచ్చిన విజయ్ దేవరకొండ కూడా తన స్టామినాతో తమ్ముడు ఆనంద్ ను పరిచయం చేశాడు. 

మొన్న మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ ఆయన హిట్ కూడా కొట్టాడు. రవితేజ సైతం నేడు కాకపోతే రేపు తన వారసుడిని పరిచయం చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాజా ది గ్రేట్ లో రవితేజ తనయుడు మహాధన్ నటించాడు. అందులో చిన్నప్పటి రవితేజగా కనిపించాడు ఈయన. ఈ సినిమా తర్వాత రవితేజ తనయుడికి మరిన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే రవితేజ మాత్రం తన కొడుకును ఇప్పుడే సినిమాలకు పరిమితం చేయడం యిష్టం లేదు. 

అందుకే ఇప్పుడు కాదు తర్వాత వస్తాడని క్లారిటీ ఇచ్చాడు మాస్ మహారాజా. తాజాగా క్రాక్ సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వారసుడి గురించి కూడా చెప్పాడు రవితేజ. మహాధన్ ఇప్పట్లో రాడు అని క్లారిటీ ఇచ్చేసాడు రవితేజ. ప్రస్తుతం తన కొడుకు 9వ తరగతి చదువుతున్నాడని.. వాడికి చదువు తప్ప మరో ధ్యాస లేదని చెప్పాడు రవితేజ. 

రాజా ది గ్రేట్ లో కూడా అనిల్ రావిపూడి బలవంతం చేస్తే ఒప్పుకున్నాను కానీ ఇప్పట్లో చదువు వదిలేసి మరి సినిమాలు చేయడం తనకు యిష్టం లేదని చెప్పాడు. తర్వాత కూడా వారసుడిపై సినిమాలు చేయమని యిష్టాన్ని రుద్దలేనని.. వాళ్లకు ఏది నచ్చితే అదే చేస్తారని చెప్పుకొచ్చాడు మాస్ రాజా.

ఇవి కూడా చ‌ద‌వండి

మార్టిగేజ్ లో 'రియ‌ల్ హీరో' ఆస్తులు..!

నిర్మాత‌గా మారనున్న‌ సోనూసూద్..!‌

'వీరులు పుట్ట‌రు..త‌యార‌వుతారు'..సోనూసూద్ బుక్ పై చిరు

VIDEOS

logo