శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 13, 2021 , 16:18:17

నా ఫేవ‌రేట్ హీరో టాప్ ఫాంలో ఉన్నారు: రాంచ‌ర‌ణ్

నా ఫేవ‌రేట్ హీరో టాప్ ఫాంలో ఉన్నారు: రాంచ‌ర‌ణ్

టాలీవుడ్ యాక్ట‌ర్ ర‌వితేజ న‌టించిన క్రాక్ చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద హిట్ టాక్ తెచ్చుకుని..స‌క్సెస్ ఫుల్ గా ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతోంది. స్టార్ యాక్ట‌ర్ రాంచర‌ణ్ క్రాక్ సినిమాను చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. క్రాక్ చాలా ఎంజాయ్ చేశా. నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్ ర‌వితేజ టాప్ ఫాంలో ఉన్నారు. శృతిహాస‌న్ ఉత్త‌మ న‌ట‌న క‌న‌బ‌రిచింది. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్‌కుమార్ వారి పాత్ర‌ల్లో అవ‌లీల‌గా ఒదిగిపోయారు. థ‌మ‌న్ అందించిన మ్యూజిక్ స్కోర్ చాలా బాగుంది.

గోపీచంద్ ర‌వితేజ‌ను టాప్ రేంజ్ లో చూపించాడు. క్రాక్ డైరెక్ట‌ర్ , ఇత‌ర టీం స‌భ్యులు అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాన‌ని ట్వీట్ చేశాడు.డాన్ శీను, బలుపు చిత్రాల త‌ర్వాత‌ గోపీచంద్ మ‌లినేని-ర‌వితేజ కాంబినేష‌న్ లో వ‌చ్చిన క్రాక్ సంక్రాంతి బ‌రిలో స‌త్తా చాటి ర‌వితేజ అభిమానులను సంబురాల్లో మునిగిపోయేలా చేస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి

ఈ సంక్రాంతి సినిమాల స్పెషాలిటీ ఏంటంటే..?

విజ‌య్ 'మాస్టర్'‌ రివ్యూ

న్యూ లుక్‌లో పవ‌న్.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

త్రివిక్ర‌మ్ తో నా సినిమా ప‌క్కా ఉంట‌ది: రామ్

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo