సోమవారం 21 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 15:34:37

నా ఫేవ‌రేట్ షాట్..మ‌హేశ్ ఎప్ప‌టికీ ఇలా ఉండాలి

నా ఫేవ‌రేట్ షాట్..మ‌హేశ్ ఎప్ప‌టికీ ఇలా ఉండాలి

మ‌హేశ్ బాబుకు ఇండస్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు బ‌ర్త్ డే విషెస్ చెప్తున్నారు. మ‌హేశ్ బాబు కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా పోకిరి. ఈ చిత్రంలో ప్ర‌తీ సీన్ ను ఆడియెన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రిన్స్ యాక్టింగ్ స్టైల్‌, డైలాగ్ డెలివ‌రీ, టైమింగ్ అన్నీ సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ మ‌హేశ్‌కు విషెస్ చెప్తూ..పోకిరీలో త‌న ఫేవ‌రేట్ షాట్‌ను ప్రేక్ష‌కుల‌తో షేర్ చేసుకున్నారు.

మ‌హేశ్ మాస్ స్టైల్ లో చేతికున్న క‌ర్చీఫ్ ను తీస్తూ న‌డుకుంటూ వ‌స్తోన్న షాట్ ను షేర్ చేస్తూ..నా ఆల్‌టైమ్ ఫేవ‌రేట్ షాట్‌..సూప‌ర్ స్టార్ ను ఎప్ప‌టికీ ఇలా చూడాల‌ని కోరుకుంటున్నాన‌ని ట్వీట్ చేశాడు. త‌న అభిమాన హీరో మ‌హేశ్ తో హ‌రీష్ శంక‌ర్ సినిమా చేయాల‌ని ఎక్స‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌. ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చేయ‌నున్న సినిమాపై దృష్టి పెట్టాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo