మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 01:56:29

స్క్రిప్ట్‌ మార్గదర్శకుడిగా..

స్క్రిప్ట్‌ మార్గదర్శకుడిగా..

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ అధినేత సి.అశ్వినీదత్‌ నిర్మించబోతున్నారు. దీపికా పడుకోన్‌ కథానాయికగా నటించనుంది. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా భారీ వ్యయంతో ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుండగా ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ జతకానుంది. ప్రముఖ దర్శకుడు, ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు స్క్రిప్ట్‌ మెంటార్‌గా (మార్గదర్శకుడిగా) వ్యవహరించనున్నారు. కొద్దినెలలుగా సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా బృందంతో కలిసి పనిచేస్తున్నారు. ‘ఈ చిత్రంలో సింగీతం శ్రీనివాసరావు భాగం కావడం ఆనందంగా ఉంది. ఆయన సృజనాత్మక ఆలోచనలు మాకు మార్గదర్శకంగా, ఉపయుక్తంగా ఉంటాయి’ అని వైజయంతీ మూవీస్‌ సంస్థ ప్రకటించింది.logo