మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 20, 2021 , 14:01:19

మ్యూజిక్‌డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కు ల‌క్కీ ఛాన్స్

మ్యూజిక్‌డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కు ల‌క్కీ ఛాన్స్

తెలుగు ప్రేక్ష‌కుల‌కు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాంగ్స్ అందిస్తూ త‌న హ‌వా కొన‌సాగిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ థ‌మ‌న్. 2020లో అల వైకుంఠ‌పురంలో, ఈ ఏడాది క్రాక్ చిత్రంతో అదిరిపోయే సాంగ్స్ ను అందించి రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఈ యువ సంగీత‌ద‌ర్శ‌కుడి ఖాతాలో మ‌రో క్రేజీ ప్రాజెక్టు ప‌డిపోయింది. మెగాస్టార్ చిరంజీవి లూసిఫ‌ర్ రీమేక్ కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసే అవ‌కాశాన్ని కొట్టేశాడు థ‌మ‌న్‌.

ఏ కంపోజ‌ర్ కైనా ఉండే అతిపెద్ద క‌ల‌. నా క‌ల నిజ‌మ‌వుతున్న వేళ‌..మ‌న బాస్ మెగాస్టార్, ప్రియ‌మైన సోదరుడు మోహ‌న్ రాజాపై నా ప్రేమ‌ను చూపించే స‌మ‌యం అంటూ ట్వీట్ ద్వారా ఆనంద‌క‌ర క్ష‌ణాల‌ను అంద‌రితో పంచుకున్నాడు థ‌మ‌న్‌. అంతేకాదు లూసిఫ‌ర్ కోసం మ్యూజిక‌ల్ జ‌ర్నీని మొద‌లుపెట్టిన‌ట్టు ట్వీట్ లో పేర్కొన్నాడు. 

రాంచ‌ర‌ణ్ హీరోగా న‌టించిన బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ కు బీజీఎం అందించాడు థ‌మ‌న్‌. ఈ వీడియో యూట్యూబ్ లో మిలియ‌న్ల సంఖ్య‌లో వ్యూస్ రాబట్టింది. అంతేకాదు సైరా మోస‌న్ పోస్ట‌ర్ కు కూడా ప‌నిచేశాడు. మొత్తానికి ఈ సారి పూర్తిస్థాయిలో చిరంజీవి సినిమా కోసం ప‌నిచేస్తున్నందుకు ఆనందంలో మునిగితేలుతున్నాడు థ‌మ‌న్‌.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

శింబును వెలేసిన నిర్మాతల మండలి..?

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

'వ‌కీల్‌సాబ్' కామిక్ బుక్ క‌వ‌ర్ లుక్ అదిరింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo