సమాజంలోని అసమానతల్ని చర్చిస్తూ తెరకెక్కుతున్న సందేశాత్మక చిత్రమిదని అన్నారు మోహన్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘1997’. నవీన్చంద్ర, కోటి కీలక పాత్రల్ని పోషించారు. ఈ చిత్రంలోని ‘ఊరి బయట గుడిసెల్లో ఉండేటోల్లం. దేవుడినే కాదు గుడిమెట్లను కూడా తాకనోళ్లం’ అనే గీతాన్ని సంగీత దర్శకుడు కోటి విడుదలచేశారు. మంగ్లీ ఈ గీతాన్ని ఆలపించింది. దర్శకనిర్మాత మాట్లాడుతూ సామాజిక ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రమిదని తెలిపారు.